కోలీవుడ్ స్టార్ రజనీకాంత్‌కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు.
ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. తదిపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఫస్ట్ ఆఫ్ కథను సిద్ధం చేసి.. సెకండ్ ఆఫ్ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్ రిలాక్స్ కోసం తాజాగా అబ్రాడ్‌కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం.
சென்னை விமான நிலையத்திலிருந்து எதிஹாட் ஏர்வேஸ் விமானம் மூலம் அபுதாபி புறப்பட்டு சென்றார் நடிகர் ரஜினிகாந்த்...#Chennai | #Airport | #Actor | #Rajinikanth | #SuperStar | #AbuDhabi | #PolimerNews pic.twitter.com/j9JJvxcLlt
— Polimer News (@polimernews) May 16, 2024
Comments
Please login to add a commentAdd a comment