
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛత్రీవాలి’. తేజస్ ప్రభ విజయ్ దేవాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఛత్రీవాలి’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (డిసెంబరు 1) సందర్భంగా ప్రకటించారు మేకర్స్. అయితే స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
‘‘హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఓ కండోమ్ ఫ్యాక్టరీలో క్వాలిటీ హెడ్‌గా పని చేసే పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు. ఆరోగ్యకరమైన శృంగారం గురించిన కొన్ని అంశాలను మా సినిమాలో చూపించాం. అలాగే ఎయిడ్స్ వ్యాధి, సెక్స్ అంశాలపై అవగాహన కలిగేంచేలా సందేశాత్మకంగా కూడా మా సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment