రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది | Ram Charan Game Changer Movie First Song Jaragandi Out Now, Watch Video Inside - Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Wed, Mar 27 2024 9:17 AM | Last Updated on Wed, Mar 27 2024 10:54 AM

Ram Charan Game Changer First Song Jaragandi Out Now - Sakshi

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు.

‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మూవీని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

గొప్ప సినిమాలను అందించాలనే తపనపడి, ఎంతటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధపడే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ తోడు కావటంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతం అని అందరూ మెచ్చుకోవాలనేలా సినిమాలు తీయటం శంకర్ అలవాటు. రామ్ చరణ్‌కి వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు.  నేడు 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement