
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజై మంచి విజయం సాధించడంతో.. చరణ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఫలితంగా అతని సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని ఫాలోవర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు.
తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ల సంఖ్య 12 మిలియన్స్‌కి చేరింది. టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా చరణ్ నిలిచాడు. ఇక తెలుగు హీరోలలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌లో అల్లు అర్జున్ 19.9 మిలియన్స్ ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉండగా, 17.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నాడు.