
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివరగా వారియర్ సినిమాలో కనిపించాడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే గతంలో రామ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే!
దీనిపై రామ్ స్పందిస్తూ.. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో తనకైనా చెప్పండంటూ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ షేర్ చేసిన ఫోటో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. "'సన్'డే.. సిద్దాంత్ పోతినేని" అంటూ పిల్లవాడితో దిగిన ఫోటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రామ్‌కు ఇంత పెద్ద కొడుకున్నాడా? అయినా తనకెప్పుడు పెళ్లైంది? అని షాకవుతున్నారు. అసలు విషయానికి వస్తే.. ఫోటోలో రామ్‌తో ఉన్న పిల్లవాడు మరెవరో కాదు.. అతడి అన్నయ్య కొడుకు సిద్దాంత్ పోతినేని. సమయం దొరికితే చాలు ఆ పిల్లాడితో ఆడుతూ కనిపిస్తాడీ హీరో.
Coz it’s a SONday.. #Sidhanthpothineni pic.twitter.com/8hrXNNsjly
— RAm POthineni (@ramsayz) January 8, 2023
చదవండి: సినిమా చూడకుండానే అమ్మ చనిపోయారు: దునియా విజయ్
వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు శ్రుతి హాసన్ డుమ్మా
Comments
Please login to add a commentAdd a comment