‘‘ఇది వరకు నేను కొన్ని టాక్ షోలు చేశాను. కానీ ప్రైమ్ వీడియోలో చేస్తున్న ఈ షో వైవిధ్యమైనది. అందుకే దీనికి ‘రానా దగ్గుబాటి షో’ అని పేరు పెట్టాం. ఇది ఆర్డినరీ టాక్ షో కాదు. వెరీ ఆథెంటిక్, అన్ ఫిల్టర్డ్, అన్‌స్క్రిప్టెడ్ షో’’ అన్నారు రానా. ఆయన ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌గా, క్రియేటర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న షో ‘ది రానా దగ్గుబాటి షో’. స్పిరిట్ మీడియా బ్యానర్‌పై అమేజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ టాక్ షో ఈ నెల 23 నుంచి అమేజాన్‌లో ప్రసారం కానుంది.
శుక్రవారం ఈ షో ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఈ షోలో ఎస్‌ఎస్ రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, నాగచైతన్య, నాని, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ షోలో మా మాటలు చాలా సరదాగా సాగుతాయి. సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే నిజాయతీగా, సహజంగా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇది. సెలబ్రిటీల గురించి ఎన్నో కొత్త విషయాలను డిస్కవరీ చేసే షో. 240 దేశాల్లో ఈ షో ప్రసారం కానుండటం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు.
Comments
Please login to add a commentAdd a comment