Rashmika Mandanna To Act With Jr NTR In Trivikram Movie - Sakshi
Sakshi News home page

రష్మికకు బంపర్‌ ఆఫర్

Mar 22 2021 9:16 AM | Updated on Mar 22 2021 3:47 PM

Rashmika Mandanna Get Chance To Pair With Jr NTR - Sakshi

రష్మిక ఆల్రెడీ మహేశ్‌ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమా అంటే మరో బంపర్‌ చాన్స్‌ అనే చెప్పాలి..

‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం నాటి నుంచి ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌ రష్మికా మందన్నా ఈ హీరోయిన్‌ రేస్‌లో ఉన్నట్లు సమాచారం. ఆల్మోస్ట్‌ రష్మికనే కన్ఫార్మ్‌ అనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

కొన్ని రోజులుగా హిందీ చిత్రం ‘మిషన్‌ మజ్ను’ షూటింగ్‌ నిమిత్తం లక్నోలో ఉన్న రష్మికా అక్కడి షెడ్యూల్‌ పూర్తి కాగానే హైదరాబాద్‌ చేరుకున్నారని తెలిసింది. ఆదివారం ఆమె త్రివిక్రమ్‌ని కలిశారట. ఎన్టీఆర్‌ సినిమా కోసమే ఈ మీటింగ్‌ అని టాక్‌. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు రష్మిక. ఆల్రెడీ మహేశ్‌ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమా అంటే మరో బంపర్‌ చాన్స్‌ అనే చెప్పాలి. మరి.. ఈ బంపర్‌ ఆఫర్‌ రష్మికాకు దక్కుతుందా? చూడాలి. 

చదవండి: ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement