Viral: Ram Charan And Jr NTR At RRR Movie Climax Scene Practice Sessions - Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌, చరణ్‌ ఫొటో వైరల్‌

Published Fri, Feb 5 2021 4:27 PM | Last Updated on Fri, Feb 5 2021 7:26 PM

RRR Movie: NTR, Ram Charan From Practice Sessions Of Climax - Sakshi

యుద్ధానికి మధ్యలో నవ్వులు అనగానే కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. పైన కనిపిస్తున్న ఇద్దరు హీరోలు వీరులుగా మారి చేయబోయే క్లైమాక్స్‌ యుద్ధానికి మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్నారు. అంటే ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం) సినిమా హెవీ క్లైమాక్స్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో ఇలా సరదాగా జోకులేసుకుని నవ్వుతుంటుంటే ఫొటోలు క్లిక్‌మనిపించారు. ఇందులో కొమురం భీమ్‌(ఎన్టీఆర్‌) నవ్వుతుంటే కోపంగా చూస్తున్నాడు అల్లూరి సీతారామరాజు(రామ్‌చరణ్‌). అదే సమయంలో చరణ్‌ ముఖంలో నవ్వులు కనిపించగానే సీరియస్‌ అవుతున్నట్లు గుర్రుగా చూస్తున్నాడు ఎన్టీఆర్‌.

ఈ రెండు ఫొటోలను ఒకేచోట చేర్చి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. అటు క్లైమాక్స్‌ కోసం కఠోరంగా శ్రమిస్తూనే ఇలా మధ్యమధ్యలో చిల్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేములో చూస్తుండటం అభిమానులకు కన్నులపండగలా ఉంది. కాగా జనవరి 19న క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రారంభమైనట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. "వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు" అంటూ ఇద్దరూ చేతులు కలిసిన ఫొటోను షేర్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి తాజా ఫొటో క్యాప్షన్‌తో ఈ క్లైమాక్స్‌ కథ కూడా ముగింపుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'బాహుబలి' చిత్రాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. (చదవండి: మూవీ ముచ్చట్లు.. రాబోయే సినిమాలు ఇవే)

(చదవండి: కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement