
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రభంజనం కొనసాగుతుంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల పరంగా ఆర్‌ఆర్‌ఆర్ ఆలిండియా రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి మ్యాజిక్‌కి, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ల నటనకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. మూవీ విడదలై రెండు వారాలు గడుస్తున్నా.. ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గడం లేదు.
ఈ సినిమాలోని ‘నాటు, నాటు’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట కోసం చరణ్, తారక్‌లు వేసిన స్టెప్పులు.. థియేటర్స్‌లో ఈలలు వేయించింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తారక్, చెర్రీల హుక్ స్టెప్పులేసి అలరించారు. సినిమా ప్రమోషన్స్‌లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు సైతం ఈ హుక్ స్టెప్పులేని ఆకట్టుకున్నారు.
తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ‘నాటు నాటు’పాటకి స్టెప్పులేసి అలరించాడు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నైజాం ఏరియాలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టిన నేపథ్యంలో నైజాం పంపిణీదారుడు, నిర్మాత దిల్ రాజు ‘ఆర్‌ఆర్‌ఆర్’టీమ్‌కి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకీ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు పలువు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి స్టెప్పులేశాడు.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. సక్సెస్ పార్టీలో నాటు నాటు స్టెప్స్ కి తనతో కలిసి డాన్స్ వేయాలని అడగ్గా.. రాజమౌళి ఓకే చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సక్సెస్ పార్టీలో నాటు నాటు పాటకి కాలు కదిపారు. వీరిద్దరు డాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న దిల్‌రాజు, తారక్, చరణ్‌లతో పాటు మిగిలిన సినీ ప్రముఖలు ఈలలు, కేకలు వేస్తూ స్టేజ్‌ని హోరెత్తించారు. ప్రస్తుతం రాజమౌళి, అనిల్ రావిపూడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Our Director @ssrajamouli fulfilled the promise he made to @Tarak9999 in @AnilRavipudi’s interview. #RRRMovie
— RRR Movie (@RRRMovie) April 4, 2022
THANK YOU
THANK YOU
THANK YOU….🤩🔥🌊🌟 pic.twitter.com/d6iXFmxQ7y
Comments
Please login to add a commentAdd a comment