Sagileti Katha Movie Trailer Getting Huge Response From Audience, Deets Inside - Sakshi
Sakshi News home page

Sagileti Katha Trailer: 'సగిలేటి కథ' అందరికి నచ్చుతుంది

Published Sat, Aug 5 2023 7:39 PM | Last Updated on Sat, Aug 5 2023 8:20 PM

Sagileti Katha Movie Trailer Get Huge Response - Sakshi

కథ బాగుంటే చిన్నా-పెద్ద అనే తేడా లేకుండా ఆ చిత్రానికి బ్రహ్మరథం పడతారు తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్య విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘సామజవరగమనా’, ‘బేబీ’ చిత్రాలే అందుకు మంచి  ఉదాహరణలు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలైన భారీ విజయం సాధించాయి.‘సగిలేటి కథ’ చిత్రం కూడా కచ్చితంగా అందరికి నచ్చుతుందని ధైర్యంగా చెబుతోంది చిత్రబృందం.

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాజశేఖర్ సుద్మూన్' దర్శకత్వం వహించారు. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ప్రస్తుతం, ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్‌ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. త్వరలోనే  ఒక మంచి లవ్ సాంగ్ తో ప్రేక్షకులని అలరించబోతున్నామని వెల్లడించింది. ట్రైలర్ కంటే, మూవీ ఇంకా బాగా ఆకట్టుకుంటుందని ధైర్యంగా చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement