Shruti Haasan Talks About Prabhas: ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్‌ - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్‌

Published Sun, Apr 25 2021 12:50 PM | Last Updated on Sun, Apr 25 2021 2:29 PM

Salaar Movie: Shruti Haasan Speaks About Prabhas - Sakshi

కమల్‌ హాసన్‌ కూతురిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్‌.. తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న శృతి.. ఆ తర్వాత స్టార్‌ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇక్కడితో ఆగకుండా బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అయితే అక్కడ ఈ అమ్మడుకి అనుకున్నంత గుర్తింపు రాలేదు. పైగా సినిమా చాన్స్‌లు లేక కొద్ది రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అచ్చొచ్చిన టాలీవుడ్‌నే మళ్లీ నమ్ముకుంది. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజతో కలిసి క్రాక్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌ సాబ్‌లో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న ఓ పాన్‌ ఇండియా మూవీలో చాన్స్‌ కొట్టేసింది. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌తో శృతీకి తొలి సినిమా ఇది. ఇటీవల సలార్‌ షూటింగ్‌లో పాల్గొన్న శృతీహాసన్‌.. ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా, సింపుల్‌గా ఉంటారని, ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ అందరితో చాలా ఆప్యాయతగా మాట్లాడుతారని, ఆయన సెట్‌లో ఉన్నంతసేపు సందడిగా ఉంటుందని చెప్పింది. స్టార్‌ హీరో అనే విషయాన్నే ఆయన పట్టించుకోడట. ప్రభాస్‌తో నటించడం ఎవరికై చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది శృతీ హాసన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement