
లాక్‌డౌన్‌లో స్టార్స్ అందరూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త టాలెంట్‌ను బయటకు తీస్తున్నారు. సల్మాన్ ఖాన్ వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తూ కనిపించారాయన. ఇది కాకుండా రచయితగానూ మారారట సల్మాన్. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమా కమిట్ అయ్యారని సమాచారం. ఈ చిత్రకథను బర్జాత్యాతో కలసి రాస్తున్నారట సల్మాన్. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్ హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్æహై’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రాలు వచ్చాయి. పెళ్లయిన జంట మధ్య ఉండే ప్రయాణాన్ని తాజా సినిమాలో చూపిస్తారట. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment