Samantha Special Song In Pushpa Movie, Official Announcement Out- Sakshi
Sakshi News home page

Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్‌ టైమ్‌ ఇది

Published Mon, Nov 15 2021 8:07 PM | Last Updated on Tue, Nov 16 2021 7:03 PM

Samantha Special Song In Pushpa Movie, Official Announcement Out - Sakshi

Samantha Special Song: సమంత స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందని గత రెండు రోజులుగా జోరుగా పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యాయి. తొలిసారి సమంత స్పెషల్‌ సాంగ్‌లో నటించబోతున్నట్లు అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. అది కూడా అల్లు అర్జున్‌ లాంటి అద్భుతమైన డాన్సర్‌తో కలిసి స్టెప్పులేయబోతుంది. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరెకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’(Pushpa Movie). కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. 



సమంతకి ఆహ్వానం పలుకుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. అడగ్గానే ఇందులో డాన్స్ నెంబర్‌ చేసేందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. `పుష్ప`లోని ఐదో సింగిల్‌ చాలా స్పెషల్ గా ఉండబోతుందని, అందుకోసం మరింత స్పెషల్‌గా సమంతని తీసుకొచ్చామని తెలిపారు.

ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ- సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చే స్పెషల్‌ సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. దానికి తోడు సమంత చేస్తున్న తొలి స్పెషల్‌ సాంగ్‌ ఇది.. మరి ఈ సాంగ్‌ ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలోని నాలుగో పాట ‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ’ను నవంబరు 19న విడుదల కానుంది. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement