సముద్రఖని సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా దర్శకుడిగా ఏది చేసిన తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది.
తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయన 1983-1994, 1999-2009 మధ్య యెల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నర్సయ్య నమోదుకాని రాజకీయ పార్టీ CPI (ML)కి చెందినవారు. యెల్లందు నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.
అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవాతివాది కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్‌కు తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment