
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘మహానటి’ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే, చాలారోజులుగా సర్కారు వారి పాట నుంచి అప్ డేట్ రాకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది.
‘షూటింగ్ పునః ప్రారంభమైనపుడు సర్కారి వారి పాట అప్‌డేట్స్ పంచుకుంటాం. అప్పటి వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ప్రతిఫలం ఉంటుందని తెలిపింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
The excitement and anticipation for #SarkaruVaariPaata is in the air! All our upcoming updates will be worth the wait. Until then, Stay safe & Stay healthy. pic.twitter.com/26PH3ENFU0
— Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2021
చదవండి:
ఆ హీరోయిన్‌ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్
ఆ హీరోయిన్ గురించి రహస్యంగా అలా అనుకునేదాన్ని: సమంత
Comments
Please login to add a commentAdd a comment