బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలన్నా, స్టేజీ దద్దరిల్లిపోయేలా డ్యాన్స్ చేయాలన్నా అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కే సొంతం. కేవలం డైలాగులతోనే కాకుండా తన డ్యాన్స్ స్టెప్పులతోనూ అదరగొడతాడు బన్నీ. ఏదో ఒకటీ రెండూ సినిమాల్లో కాకుండా ప్రతి సినిమాలోనూ డ్యాన్స్‌తో ఇరగదీస్తాడు. అతడు పూజా హెగ్డేతో కలిసి చేసిన సిటీమార్ సాంగ్ కూడా ఓ సెన్సేషనే.. తాజాగా ఇదే పాట హిందీలో రిలీజ్ అయింది.
కాకపోతే అక్కడ బన్నీ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే స్థానంలో దిశాపటానీ ఆడిపాడారు. ఈ సందర్భంగా సిటీమార్ ఒరిజినల్ సాంగ్‌లో ఓ రేంజ్‌లో స్టెప్పులేసిన అల్లు అర్జున్‌ను పొగడకుండా ఉండలేకపోయాడు సల్లూ భాయ్. 'సిటీమార్‌లో మీ పర్ఫామెన్స్ చాలా బాగా నచ్చింది. మీ డ్యాన్స్, స్టైల్.. ప్రతీది ఫెంటాస్టిక్ అసలు.. లవ్ యూ బ్రదర్..' అని ట్వీట్ చేశాడు.
Thank you soo much Salman garu . It’s a pleasure to receive a compliment from you . It’s such a sweet gesture. Looking forward for the RADHE magic on screens with fans doing SEETI MAAR for you . Thank you for your love . 🖤AA
— Allu Arjun (@alluarjun) April 26, 2021
ఇది చూసిన బన్నీ 'థ్యాంక్ యూ సోమచ్ సల్మాన్ గారు' అంటూ రిప్లై ఇచ్చాడు. 'మీ నుంచి కాంప్లిమెంట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. స్క్రీన్ మీద రాధే మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమకు కృతజ్ఞతలు..' అని రాసుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ మాత్రం మా హీరో బాగా చేశాడంటే మా హీరో అంటూ వాదులాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో సిటీమార్ సాంగ్ హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment