
లాక్‌డౌన్ కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో థియేటర్లు మూత పడటంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ విడుదల అవుతున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చిన, థియేటర్లు తెరుచుకున్న ఓటీటీ హవా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ సొంతంగా ఓటీటీ యాప్‌ను ప్రారంభించారు.
చదవండి: ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ సైతం ఈ జాబితాలో చేరాడు. తాజాగా ఆయన ఓటీటీ యాప్‌ను నెలకొల్పినట్లు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. ‘ఎస్‌ఆర్‌కే ప్లస్’ అనే పేరుతో ఈ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన షారుక్ దీనికి సంబంధించిన లోగోను కూడా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేస్తూ.. ‘ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి’ అంటూ ఆయన ఫొటోతో ఉన్న ఎస్‌ఆర్‌కే ప్లస్(SRK+) లోగోను విడుదల చేశాడు.
చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే..
ఇక ఆయన ట్వీట్‌కు షారుక్ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఎప్పుడెప్పుడు ఎస్‌ఆర్‌కే ప్లస్‌ను సబ్‌స్రైబ్ చేసుకుందామా? అని వేయిట్ చేస్తున్నాం సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ ఒటీటీ ప్లాట్‌ఫాం ద్వారా షారుక్ తన పఠాన్ మూవీని విడుదల చేయబోతున్నాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా షారుక్ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ఇప్పటికే గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమారుడు అయాన్ అరెస్ట్‌తో బాద్‌షా ఓటీటీ బిజినెస్ ఎంట్రీ వాయిదా పడింది. ఇప్పటికే పలు వ్యాపారంలో భాగస్వామ్యంతో పాటు.. ఐపీఎల్ కోల్‌కత్తా నైట్ రైటర్స్ టీంకు షారుక్ యజమాని అనే సంగతి తెలిసిందే.
Kuch kuch hone wala hai, OTT ki duniya mein. pic.twitter.com/VpNmkGUUzM
— Shah Rukh Khan (@iamsrk) March 15, 2022
Comments
Please login to add a commentAdd a comment