సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్‌ | Actors Siddharth and Aditi Rao Hydari got married today in a secret ceremony - Sakshi
Sakshi News home page

Siddharth: తెలుగు హీరోయిన్‌ను పెళ్లాడిన సిద్దార్థ్‌.. ఇద్దరికీ రెండోదే!

Published Wed, Mar 27 2024 12:01 PM | Last Updated on Wed, Mar 27 2024 12:44 PM

Siddharth, Aditi Rao Hydari Got Married - Sakshi

హీరో సిద్దార్థ్‌ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్‌ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్‌ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్‌- అదితి పెళ్లి జరిగింది.

జర్నీ ఎక్కడ మొదలైంది?
అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్‌కు, ఈవెంట్స్‌కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్‌ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్‌కు ప్రశ్న ఎదురవగా.. 'అదితి' దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్‌.. ఇప్పుడేకంగా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

ఎవరీ అదితి?
అదితిరావు హైదరి.. అచ్చ తెలుగమ్మాయి. తన కెరీర్‌ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్‌లో హీరోయిన్‌గా మెరిసింది. గతంలో ఈమె సత్యదీప్‌ మిశ్రాను పెళ్లాడింది. 2012లో అతడికి విడాకులిచ్చింది. సిద్దార్థ్‌ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లాడాడు. వీరి మధ్య బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. సినిమాల విషయానికి వస్తే బాయ్స్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్‌, ఓ మై ఫ్రెండ్‌.. ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.

చదవండి: తిరుమలలో రామ్‌ చరణ్‌ కూతురు 'క్లీంకార' ఫేస్‌ రివీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement