హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్‌ను ఓపెన్‌గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు.
షూటింగ్ అని చెప్పి
వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కన్ఫమ్ చేసిన హోస్ట్
అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్‌లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ..
Comments
Please login to add a commentAdd a comment