Sobhita Dhulipala reacts to dating rumours with Naga Chaitanya - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: చైతో డేటింగ్‌ రూమర్స్‌.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published Mon, May 8 2023 10:04 AM | Last Updated on Mon, May 8 2023 10:41 AM

Sobhita Dhulipala Reaction Rumours - Sakshi

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రొఫెషనల్‌ విషయాలతో పాటు పర్సనల్‌ విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటారు అభిమానులు. ఈ క్రమంలో తారల లవ్‌, డేటింగ్‌, పెళ్లి, విడాకులు వంటి విషయాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇద్దరు సెలబ్రిటీలు బయట కలిసి కనిపించారంటే చాలు వారిది స్నేహమా? ప్రేమా? అని డౌటానుమానాలు వ్యక్తం చేస్తారు. వారు దానిపై క్లారిటీ ఇచ్చేంతవరకు వారిని లవ్‌ బర్డ్స్‌గానే పరిగణిస్తారు.

ఈ క్రమంలో నాగచైతన్య- శోభిత ధూళిపాళ డేటింగ్‌ రూమర్స్‌ తరచూ తెరపైకి వస్తునే ఉన్నాయి. ఓసారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో ఈ డేటింగ్‌ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితతో ప్రేమలో పడ్డాడని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. తాజాగా తనపై వచ్చే రూమర్లపై శోభిత ధూళిపాళ స్పందించింది.

'నేను మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా చేశాను. ఇందులో ఏఆర్‌​ రెహమాన్‌ పాటలకు డ్యాన్స్‌ చేయడం అద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన పని లేదు. ఆ రూమర్‌తో నాకసలు సంబంధమే లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు అర్జంటుగా వెళ్లి క్లారిటీ ఇచ్చేయాలని ఎందుకనిపిస్తుంది. ఏ తప్పూ చేయనప్పుడు కంగారుపడాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను' అని చెప్పుకొచ్చింది శోభిత.

చదవండి: వంద సినిమాలు చేశా, సంపాదించినదంతా పోగొట్టుకున్నా: కమెడియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement