Sobhita Dhulipala Reacts On Dating Rumours With Naga Chaitanya - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: చైతూతో డేటింగ్‌పై స్పందించిన శోభిత, వీడియో వైరల్‌!

Published Sun, Jun 26 2022 8:23 PM | Last Updated on Sun, Jun 26 2022 8:58 PM

Sobhita Dhulipala Reacts On Dating Rumours With Naga Chaitanya - Sakshi

సెలబ్రిటీల ప్రొఫెషనల్‌ విషయాలే కాదు, వారి వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలో తారలు ఎవరితోనైనా కొంచెం క్లోజ్‌గా కనిపించినా వారితో డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో రూమర్స్‌ పుట్టుకొస్తాయి. కొందరు తారలు వీటిపై స్పందించి క్లారిటీ ఇస్తే, మరికొందరేమో దాన్నసలు ఖాతరే చేయరు. ఈ క్రమంలో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది అర్థం కాక ఫ్యాన్స్‌ తలలు పట్టుకుంటున్నారు.

ఇకపోతే నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అటు చై కానీ ఇటు శోభిత కానీ స్పందించనేలేదు. అయితే ఈ రూమర్లకు మేజర్‌ హీరోయిన్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో శోభిత మధ్య వేలును చూపిస్తూ తన కోపాన్ని వెల్లగక్కింది.

తన మీద లేనిపోని పుకార్లు సృష్టించిన వారికి ఈ వీడియోతో శోభిత గట్టి సమాధానం చెప్పిందంటూ ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు మాత్రం శోభిత స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ఎక్కడా ఈ వీడియో పోస్ట్‌ చేయలేదని, ఇదేదో పాత వీడియో అయి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. శోభిత ధూళిపాళ ఇటీవలే మేజర్‌ చిత్రంతో అలరించింది. అటు నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’, 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాలు, 'దూత' వెబ్‌ సిరీస్‌ త్వరలో రిలీజ్‌ కానున్నాయి.

చదవండి: నాలుక కట్‌ చేసుకో.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్‌ వార్నింగ్‌?!
నా ప్రియుడికి నచ్చట్లే, అందుకే ఎక్స్‌పోజింగ్‌ మానేశా: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement