'దస్తాన్ ఈ మొహబ్బత్: సలీం అనార్కలీ..' 2018లో వచ్చిందీ సీరియల్. దాదాపు ఏడాదిపాటు ప్రసారమైన ఈ సీరియల్‌లో బుల్లితెర నటి సోనారిక బడోరియా.. అనార్కలీగా ప్రధాన పాత్రలో నటించింది. ధారావాహిక పూర్తై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తనకు రావాల్సిన రూ.70 లక్షల డబ్బును ఇవ్వడం లేదని వాపోయింది సోనారిక. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
'ఎదురుచూపులతోనే మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ నాకు డబ్బులివ్వలేదు. నాకే కాదు, ఆ సీరియల్‌కు పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్ల పేమెంట్లు కూడా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం నేను కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను. మొదటగా కరోనా తొలి దశలో ఎంతో ఇబ్బందులు పడ్డాం, ఆ తర్వాత ఇదిగో ఇలా మాకు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడంతో సతమతమవుతున్నాం. దీనిపై చట్టపరంగా కూడా ముందుకు వెళ్లాను. వీలైనంత త్వరగా నాకు రావాల్సిన రూ.70 లక్షలు ముట్టజెపుతారని ఆశగా వేచి చూస్తున్నా' అని చెప్పుకొచ్చింది. బుల్లితెరపై సత్తా చాటిన సోనారిక ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల మీద ఫోకస్ చేస్తోంది.
చదవండి: Bigg Boss OTT Promo: అఖిల్ సార్థక్‌ను హర్ట్ చేసిన చైతూ, సైకో పాత్రకు సెట్టంటూ..
Comments
Please login to add a commentAdd a comment