రాముడిగా మహేశ్‌బాబు? | SS Rajamouli and Mahesh Babu Film To Start Shooting In January 2025: SSMB 29 Update | Sakshi
Sakshi News home page

రాముడిగా మహేశ్‌బాబు?

Published Fri, Nov 15 2024 3:34 AM | Last Updated on Fri, Nov 15 2024 8:59 AM

SS Rajamouli and Mahesh Babu Film To Start Shooting In January 2025: SSMB 29 Update

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతున్నారు మహేశ్‌బాబు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని దర్శకుడు రాజమౌళి లొకేషన్స్‌ వేట ప్రారంభించారు. త్వరలోనే కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేయనున్నారాయన. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రసంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి, కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే పేర్కొన్నారు.

అయితే ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథనం ఓ నిధి అన్వేషణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఈ చిత్రకథలో రామాయణం ఇతిహాసం ప్రస్తావన ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. అంతేకాదు... కొన్ని సీన్స్‌లో రాముడిగా మహేశ్‌బాబు కనిపిస్తారని, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని, ఈ సీన్స్‌ కోసం హైదరాబాద్‌లోనే వారణాసిని తలపించే సెట్‌ను రెడీ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభం అవుతుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement