క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌పై అభిమాన్ని భిన్నమైన రితీలో ప్రదర్శించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో. 50 రోజులు కష్టం అనంతరం తన అభిమాన దర్శకుడి రూపాన్ని ఇలా ప్రపంచానికి చూపించాడు. ఈ అరుదైన దృశ్యానికి కడప జిల్లా బోరెడ్డిగారిపల్లి గ్రామం వేదికైంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన సువిక్షిత్ బోజ్జా ‘దూరదర్శిని’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇక సువిక్షిత్ సుకుమార్‌కు వీరాభిమాని.
చదవండి: స్పెయిన్‌లో పెళ్లి సందడి హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..
ఈ క్రమంలో తన అభిమానాన్ని చాటుకునేందుకు బోరెడ్డిగారి పల్లిలోని తన రెండున్నర ఎకరాల పోలాన్ని వేదికగ చేసుకున్నాడు సువిక్షిత్. అందులో వరిసాగు చేస్తూ సుకుమార్ రూపం వచ్చేలా వినూత్న ఆలోచన చేశాడు. తన వ్యవసాయ భూమిలో సుకుమార్ రూపం వచ్చేలా వరి పంట సాగు చేశాడు. 50 రోజలు అనంతరం డ్రోన్‌తో ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఇందులో సుకుమార్ రూపంతో పాటు ‘పుష్ప 2’ మూవీ టైటిల్ ఉండేలా వరి పంటను సాగు చేశాడు.
చదవండి: పునీత్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి!
ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో పాటకు సువిక్షిత్ ప్రత్యేకంగా సుకుమార్‌పై పాటని కూడా సిద్ధం చేశాడట. అంత పూర్తయ్యాకి ఈ అరుదైన దృశ్యాన్ని తన కార్యాలయంలో సుకుమార్‌కు చూపించాడు. అది సుక్కు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారట. ‘నోట మాట రాలేదని, అది చూడగానే నా కళ్లలో ఒక్కసారి నిళ్లు తిరిగాయంటూ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడట. అంతేకాదు ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసినట్లు సువిక్షిత్ మీడియాతో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment