
దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ బాలీవుడ్ సినిమా 'జాట్' ట్రైలర్ వచ్చేసింది. పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీలో సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాన్ శీను, క్రాక్, బలుపు వంటి సినిమాల్లో తన యాక్షన్ ఫ్యాక్డ్ సిన్స్ జాట్‌లో భారీగానే ఉన్నాయి. ఆటమ్ బాంబ్ లాంటి డైలాగ్స్‌తో ట్రైలర్ మెప్పించేలా ఉంది.

Comments
Please login to add a commentAdd a comment