ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ | Suriya To Play Five Roles In Kanguva Movie | Sakshi
Sakshi News home page

Kanguva: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ

Published Tue, Nov 14 2023 10:39 AM | Last Updated on Tue, Nov 14 2023 10:49 AM

Suriya Five Roles Played In Kanguva Movie - Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్‌ రాజా యువీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న భారీ పిరియాడికల్‌ కథా చిత్రం ఇది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్కు గ్లింమ్స్‌ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సూర్య గెటప్, ఆయన లుక్స్, హావభావాలు చిత్ర ప్రముఖులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మెట్‌లో ఏకంగా 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

కొంగువ చిత్రం 2024 సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. దీంతో ఈ చిత్రం పైనే ఇప్పుడు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల దృష్టి ఉంది. కాగా దీపావళి సందర్భంగా కంగువ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో సూర్య రగులుతున్న కట్టెను చేతిలో పట్టుకుని రౌద్రం ప్రదర్శిస్తుండగా.. ఆయన వెనుక అనుసరగణం పోరుకు సిద్ధంగా ఉన్న దృశ్యం కంగువ చిత్రంపై మరింత ఆసక్తిని రేకేతిస్తోంది.  యాక్షన్‌తో కూడిన భారీ పీరియాడిక్‌ డ్రామా చిత్రమిది. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక గెటప్‌ను తాజాగా మేకర్స్‌ రివీల్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement