![Taarak Mehta Ka Ooltah Chashmah Writer Abhishek Makwana Takes His Own Life - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/4/ABHISHEK-MAKWANA.jpg.webp?itok=_5cVu09O)
ముంబై : ప్రముఖ సీరియల్ రచయిత అభిషేక్ మక్వానా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనా ప్రదేశం నుంచి గుజరాతీలో రాసిన ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరాల కోసం తీసుకున్న అప్పులు చెల్లించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, వాటి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. దీనిపై ఆయన తమ్ముడు జెనిస్ మాట్లాడుతూ.. ‘‘మా అన్న చనిపోయిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ( మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!)
అన్న తీసుకున్న అప్పులు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలనుంచి కూడా ఫోన్‌లు వచ్చాయి. దీంతో నేను ఆయన ఈ మెయిల్స్ చెక్ చేసి చూశాను. మొదట ఈజీ లోన్ యాప్ ద్వారా కొద్ది మొత్తం లోన్‌ను తీసుకున్నారు. ఆ యాప్ 30 శాతం అధిక వడ్డీని వసూలు చేసేది’’ అని పేర్కొన్నాడు. అభిషేక్ ప్రఖ్యాత సీరియల్ ‘తారక్ మెహ్తాకా ఉల్టా చెస్మా’ రచయితల్లో ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment