Varahi Arrested: Tamil Cinema Producer Forced To 2nd Marriage - Sakshi
Sakshi News home page

Tamil Producer: పెళ్లి చేసుకోమని బెదిరింపులు, తమిళ నిర్మాత అరెస్ట్‌

Published Tue, Apr 26 2022 8:21 AM | Last Updated on Tue, Apr 26 2022 11:05 AM

Tamil Cinema Producer Varahi Arrested - Sakshi

సాక్షి, చెన్నై: యువతిని వేధించిన కేసులో సినీ నిర్మాత వారాహిని పడపళని మహిళా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై విరుగంబక్కం నటేసన్‌ నగర్‌లో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్న రాణి (31) వడపళని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు ఇచ్చింది. అందులో తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే సినీ నిర్మాత వారాహి కూడా నివసిస్తున్నారని, అతడు తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేశాడని ఆరోపించారు.

అందుకు తాను తిరస్కరించడంతో బెదిరిస్తున్నాడని, అతడిపై తగిన చర్యలు తీసుకోమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన విచారణలో నిర్మాత రాణిని వేధించినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిని సోమవారం కటకటాల్లోకి నెట్టారు.

చదవండి 👉 ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

సూరరై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్‌, షూటింగ్ స్టార్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement