సమంత ప్రస్తుతం ఇటీవలే 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ప్రత్యేకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై కొందరు అభిమానులైతే ఏకంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సమంత కెరీర్‌పై డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతను టాలీవుడ్‌కు తానే పరిచయం చేయాల్సిందని అన్నారు. సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసిందని తానేనని చెప్పుకొచ్చారు.
(ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే)
శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 'సమంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. ఆడిషన్ కోసం హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆడిషన్ ముగిశాక సమంతను చెన్నై పంపిద్దామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువ. ఆ నెక్ట్స్ డే తక్కువగానే ఉన్నాయి. దీంతో ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని సమంతను అడిగాం. కానీ ఆమె అంగీకరించలేదు. చేసేదేమీ లేక టికెట్ బుక్ చేసి అదే రోజు చెన్నై పంపించాం. హైదరాబాద్‌లో ఒక్కరోజు ఉండేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే సమంత ఆడిషన్ నచ్చి తీసుకుందామంటే అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. మా వద్ద అంత బడ్జెట్ లేక వెనక్కి తగ్గాం.' అని వెల్లడించారు.
కాగా.. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్‌గా శివ నాగేశ్వరరావు పనిచేశారు. మనీ మనీ, సిసింద్రీ, హేండ్సప్, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజాకృష్ణమూర్తి లాంటి సినిమాలు అందించారు. హీరోయిన్ అంజలిని ఫొటో సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment