నటి ఇంట విషాదం.. చివరి నిమిషంలో బిగ్‌బాస్‌కు గుడ్‌బై! | Bigg Boss Telugu Season 7: TV Actress Pooja Murthy Father Passed Away - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సి ఉండగా నటి ఇంట విషాదం

Sep 1 2023 2:33 PM | Updated on Sep 2 2023 4:44 PM

TV Actress Pooja Murthy Father Passed Away - Sakshi

పూజా మూర్తి తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సోషల్‌ మీడియాలోనూ తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనైంది. RIP.. రిటర్న్‌ ఇఫ్‌ పాజిబుల్‌ (వీలైతే తిరిగి వచ్చేయండి). నిన్ను ఎంతగానో ప్రేమించాను నాన్నా.. ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నాను. నిన్ను గర్వపడేలా చేశానని భావిస్తున్నాను.

మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ 7 షురూ కానుంది. ఈసారి సరికొత్త థీమ్‌తో ముందుకు రాబోతోంది బిగ్‌బాస్‌. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు ఫైనలయ్యారు. కొందరి ఏవీలు, డ్యాన్స్‌ ప్రిపరేషన్స్‌ సైతం రెడీ అయిపోయాయి. కానీ ఇంతలో బుల్లితెర నటి పూజా మూర్తి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆమె తండ్రి కన్నుమూశారు. దీంతో నటి ఇంట విషాద చాయలు అలుముకున్నాయి.

తండ్రి మరణంతో పుట్టెడు శోకంలో ఉన్న నటి బిగ్‌బాస్‌ ఛాన్స్‌ వదులుకున్నట్లు తెలుస్తోంది. పూజా మూర్తి తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సోషల్‌ మీడియాలోనూ తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనైంది. 'RIP.. రిటర్న్‌ ఇఫ్‌ పాజిబుల్‌ (వీలైతే తిరిగి వచ్చేయండి). నిన్ను ఎంతగానో ప్రేమించాను నాన్నా.. ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నాను. నిన్ను గర్వపడేలా చేశానని భావిస్తున్నాను.

తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు చేసుంటే నన్ను క్షమించు నాన్నా.. నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆశీర్వాదాలు నాకు, అమ్మకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్‌ ఫైనల్‌ లిస్ట్‌లో ఉంది పూజా మూర్తి. కానీ తండ్రి అకాల మరణంతో ఆమె షో నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.

చదవండి: మొత్తానికి సాధించాం.. విజయ్ ట్వీట్ వైరల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement