ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్ | Upcoming Telugu Movies To Release On OTT In January Last Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: జనవరి లాస్ట్ వీకెండ్.. ఓటీటీల్లోకి ఏకంగా 27 మూవీస్

Published Sun, Jan 21 2024 9:23 PM | Last Updated on Mon, Jan 22 2024 10:20 AM

Upcoming OTT Release Movies Telugu January Last Week 2024 - Sakshi

సంక్రాంతి హడావుడి అయిపోయింది. మళ్లీ స్కూల్స్, ఆఫీస్‌లు షరా మాములే! పండక్కి రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' ఇప్పటికీ దుమ్ముదులుపుతుండగా.. మిగతా వాడి సందడి మాత్రం తగ్గిపోయింది. ఈ వారం 'కెప్టెన్‌ మిల్లర్', 'అయలాన్' లాంటి డబ్బింగ్ మూవీస్‌తో పాటు 'ఫైటర్' అనే హిందీ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం ఏకంగా 27 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'నెరు' అనే డబ్బింగ్ మూవీ ఆసక్తి కలిగిస్తోంది. మలయాళంలో హిట్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా కోసం మూవీ లవర్స్ వెయిటింగ్. దీనితో పాటు 'ఫైట్ క్లబ్', 'సామ్ బహుదూర్' సినిమాలు.. అలానే 'పంచాయత్ సీజన్ 3' కూడా కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 22-జనవరి 28 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22
  • జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23
  • లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23
  • గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
  • మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
  • బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26
  • క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28

అమెజాన్ ప్రైమ్

  • కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి  23
  • కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25
  • హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24
  • ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26
  • పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26

హాట్‌స్టార్

  • నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23
  • ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26
  • కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26
  • ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27

జీ5

  • సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26

సోనీ లివ్

  • షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 22

బుక్ మై షో

  • వోంకా (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22
  • ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 23
  • ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 23

జియో సినిమా

  • మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22

ఆపిల్ ప్లస్ టీవీ

  • మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement