Vadde Naveen Likely To Enter In Bigg Boss 6 Telugu, Rumors Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ 6లోకి వడ్డే నవీన్‌.. భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌!

Published Tue, Jun 28 2022 12:29 PM | Last Updated on Thu, Sep 1 2022 1:59 PM

Vadde Naveen Entry In Bigg Boss 6 Telugu, Rumors Goes Viral - Sakshi

తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో... సీజన్‌ సీజన్‌కి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి,  ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్‌ నిర్వాహకులు. సెప్టెంబర్‌ మొదటి వారంలో  ఆరో సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షో ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే కంటెస్టెంట్స్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. 

సీజన్‌ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా  హీరో వడ్డే నవీన్‌ వచ్చి చేరాడు. ఒకప్పుడు స్టార్‌ హీరో అయిన వడ్డే నవీన్‌.. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాల్లోనే కాకుండా  ఏ ఈవెంట్‌లో కూడా నవీన్‌ కనిపించడం లేదు. అసలు ప్రస్తుతం వడ్డే నవీన్‌ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

(చదవండి: క్రేజీ రూమర్.. ఆ దర్శకుడితో మహేశ్‌ బాబు 30వ సినిమా!)

అయితే ఇప్పటికీ ఆయన సినిమాలు మాత్రం టీవీ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్‌కి మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే బిగ్‌బాస్‌ నిర్వాహకులు వడ్డే నవీన్‌ని సీజన్‌ సిక్స్‌లోకి ఆహ్వానించారట. ఈ షోలో పాల్గొనడానికి మొదట్లో ఆయన ఒప్పుకోలేదట. దీంతో భారీ రెమ్యునరేషన్‌ని ఆఫర్‌ చేసి ఆయనను ఒప్పించారట. ఒకవేళ ఇదే నిజమైతే సీజన్‌ సిక్స్‌కి వడ్డే నవీనే స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతాడు. నవీన్‌తో పాటు సీజన్‌ సిక్స్ లిస్ట్‌లో  జబర్దస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ  కంటెస్టెంట్ లు శివ, అనిల్, మిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement