నటి వైశాలి టక్కర్ ఆత్మహత్యతో హిందీ బుల్లితెర ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైశాలి.. ఇండోర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని మరణించింది. ఆమె నివాసంలో దొరికిన సూసైడ్ నోట్‌లో.. మాజీ బాయ్‌ఫ్రెండ్ వేధింపులకు పాల్పడినట్లు ఉందని ఇండోర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎమ్ రెహమాన్ తెలిపాడు.
కాగా వైశాలి బలవన్మరణానికి పాల్పడిన క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చివరి పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తూ తన బాయ్‌ఫ్రెండ్‌ను పరీక్షించింది. ఈ టెస్ట్‌లో అతడు తనను మోసం చేయడంతో వైశాలి బండబూతులు తిట్టింది. అయితే ఈ వీడియోకు కామెడీ, ఫన్నీ వీడియోస్ అన్న ట్యాగులను జత చేసింది. కానీ ఇది చూస్తుంటే అది స్కిట్‌లా లేదని, రియల్ లైఫ్‌లో జరిగినదాన్నే ఇలా పరోక్షంగా చెప్పినట్లుంది అంటున్నారు ఫ్యాన్స్.
అలాగే సరిగ్గా వారం కిందట ఆమె పోస్ట్ చేసిన మరో వీడియో సైతం వైరల్ అవుతోంది. ఆదివారం మీరేం చేస్తారు? నేనైతే ఇదిగో ఇలా ఖాళీగా ఉండి ఫ్యాన్ తిప్పుతూ ఉంటానని చూపించింది. ఇది చూసిన నెటిజన్లు మరింత ఎమోషనలవుతున్నారు. ఫ్యాన్ చూపిస్తూ మీరు అప్పుడే హింటిచ్చారు.. కానీ మేమే అర్థం చేసుకోలేదు అంటూ బాధపడుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌లో సంజన పాత్రతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది వైశాలి. పలు సీరియల్స్‌తో అలరిస్తూ వచ్చిన ఆమె గతేడాది ఏప్రిల్‌లో డాక్టర్ అభినందన్ సింగ్ హుండాల్‌తో నిశ్చితార్థం జరుపుకుంది. కోవిడ్ వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించింది. కానీ అంతలోనే వీరు బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
చదవండి: విషాదం.. సుశాంత్ సింగ్ బాటలోనే అతడి క్లోజ్ ఫ్రెండ్
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment