Varun Tej Interesting Comments on Sister Niharika in Oka Chinna Family Story Pre Release Event - Sakshi
Sakshi News home page

Varun Tej: ‘అందుకే నిహారిక విషయంలో జోక్యం చేసుకోను’

Published Fri, Nov 12 2021 5:01 PM | Last Updated on Fri, Nov 12 2021 6:42 PM

Varun Tej Interesting Comments On Sister Niharika In Pre Release Event - Sakshi

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. త్వరలో ఓటీటీలో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌ ఒక చిన్న ఫ్యామిలీ ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిహారిక, భర్త చైతన్యలు హజరుకాగా, నిహారిక సోదరుడు, టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు.

ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. మున్ముందు వెబ్ సిరీస్‌లు, సినిమాలు అనే తేడా ఉండదని, వెబ్ సిరీస్ లు కూడా సినిమాల స్థాయిలో ఉంటున్నాయని పేర్కొన్నాడు. సినిమాల ద్వారా కొందరికే అవకాశం వస్తుందని, కానీ వెబ్ సిరీస్‌ల వల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డాడు. ఇక నిహారిక గురించి చెబుతూ.. తను ఎప్పుడూ సొంత దృక్పథం ఉంటుందని, తన పనితీరులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చెప్పాడు. తన కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ తానే తీసుకుంటుందని వరుణ్‌ పేర్కొన్నాడు.

అయితే ఏడాది క్రితమే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహా చెప్పిందని, ఇటీవల ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్ చూసి నిజంగా ఆశ్చర్యపోయానని వరుణ్ తేజ్ అన్నాడు. సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ వేదికపై ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంట్లో ఒక్కోటి 40 నిమిషాల నిడివి గల 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు మహేశ్ ఉప్పాల దర్శకుడు. ఇందులో సీనియర్ నటులు నరేశ్, తులసి, స్టాండప్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా నటించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement