Varun Tej Enjoys a Romantic Coffee Date With Fiance Lavanya Tripathi - Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Tripathi: వరుణ్-లావణ్య డేటింగ్.. అక్కడ అలా!

Jul 18 2023 8:56 PM | Updated on Jul 18 2023 9:05 PM

varun Tej Lavanya Tripathi Coffee Date Pic - Sakshi

మెగాహీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్. సినిమాలు విభిన్నంగా చేస్తుంటాడు. బయట కూడా పెద్దగా కనపడడు. వివాదాలు జోలికి అయితే అసలు పోనేపోడు. అలాంటి వరుణ్.. కొన్నిరోజుల ముందు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఏడాది వీళ్ల పెళ్లి ఉండనుందని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్లిద్దరూ డేట్‌కి వెళ్లారు.

(ఇదీ చదవండి: 'బేబీ' హిట్ అవడానికి అదే కారణం: విజయ్ దేవరకొండ)

'మిస్టర్' సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. ఆ మూవీ హిట్ అవ్వలేదు కానీ వీళ్ల లైఫ్ మాత్రం సూపర్‌హిట్ అయింది. అప్పుడు ప్రేమలో పడ్డ వీళ్లిద్దరూ ఇన్నేళ్ల పాటు తమ బంధాన్ని సీక్రెట్‌గా మెంటైన్ చేస్తూ వచ్చారు. కొన్నిరోజుల ముందు పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఇకపోతే పెళ్లికి ముందే చిల్ అవుతున్న ఈ జంట.. ఈ మధ్య ఇటలీ వెళ్లొచ్చారు. ఇప్పుడు సరదాగా అలా కాఫీ డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని తమ తమ ఇన్ స్టా స్టోరీల్లో షేర్ చేశారు. వరుణ్ ఇన్ స్టాలో లావణ్య పిక్, లావణ్య ఇన్ స్టాలో వరుణ్ తేజ్ ఫొటోలు కనిపించడం మెగాఫ్యాన్స్ సంతోషానికి కారణమైంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు.  

(ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement