మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్‌ సాయం | Viral: Actor Nikhil Helped Netizen Who Asked To Arrange Remdivisir Medicine | Sakshi
Sakshi News home page

కరోనా రోగికి హీరో నిఖిల్‌ సాయం

Published Fri, Apr 23 2021 9:45 AM | Last Updated on Fri, Apr 23 2021 2:10 PM

Viral: Actor Nikhil Helped Netizen Who Asked To Arrange Remdivisir Medicine - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గడగడలాడిస్తోంది. చేయి చేయి కలిపినా, మాస్క్‌ లేకుండా కనిపించినా, పార్టీలంటూ, వినోదమంటూ పదే పదే బయట తిరిగినా మన ఒంట్లోకి ప్రవేశించేందుకు రెడీగా ఉందీ కరోనా. సవాలక్ష జాగ్రత్తలు తీసుకున్నవారు కూడా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు చేసినా ఆ మాయదారి రోగం బారిన పడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెడుతుందీ కరోనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఉధృతి విపరీతంగా ఉంది.

అదే సమయంలో కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్స్‌ల కొరత కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి రెమిడిసివిర్‌ ఇప్పించాలంటూ హీరో నిఖిల్‌ను ట్విటర్‌లో సంప్రదించాడు. దయచేసి మాకు సాయం చేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. దీనిపై పెద్ద మనసుతో స్పందించిన హీరో.. 'సిరివూరి రాజేశ్‌ వర్మ మీకు అవసరమయ్యేన్ని రెమిడిసివిర్‌ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది' అని భరోసా కల్పించాడు.

చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్‌కు సడన్‌ బ్రేక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement