
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్‌పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన.
ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. ఇక గత ఏడాది శాండిల్ వుడ్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పై బయటికొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment