శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నటి సంజన గల్రానీ బెయిల్‌పై బయటకు రాగానే రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంతో అడుగుపెట్టిన ఆమె ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన సీక్రేట్ డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాక గతేడాది తను పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘నా భర్త అజీజ్ పాషా. ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మా స్నేహం పెద్దాయ్యాక ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఎప్పుడో మేము కన్‌ఫాం చేసుకున్నాం కానీ ఎవరికి చెప్పలేదు. ఇన్నేళ్లు సీక్రేట్‌గా డేటింగ్‌లో ఉన్నాం. ఇక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకునే లోపే ఈ సంఘటన జరింగింది(డ్రగ్ కేసు)’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు చెప్పింది. కానీ బయటకు వచ్చిరాగానే తను కరోనా బారిన పడటంతో కాస్తా నిరాశకు గురయ్యాన్నంది.
అప్పుడు అజీజ్ సపోర్టుతోనే కరోనా నుంచి కోలుకున్నానని, ఆనంతరం తాను అనుకున్నట్లుగానే కొద్ది మంది సమక్షంలో అజీజ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అయితే తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని అందుకే ఎవరీకి చెప్పకుండా ఇన్నేళ్లు సీక్రేట్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. అయితే ఆయన డాక్టర్ కావడంతో కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆయన ఎక్కువ సమయంలో ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని, దీంతో నా ఆరోగ్యం కంటే ఆయన ఆరోగ్యం పట్ల బెంగగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
చదవండి:
అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్
డ్రగ్స్ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment