
సోషల్‌మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారామె. బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో మాదిరిగా పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.
ఎప్పుడో ఒకసారి అది కూడా చాలా ముఖ్యమైన అప్‌డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంది. జులై 21న సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చివరగా పోస్ట్ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహం అభిమానుల్లో కలుగుతుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఎక్కువగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్, నెగిటివ్ కామెంట్స్‌కి భయపడి సామ్ ఇలా మారిపోయిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment