
డార్లింగ్ ప్రభాస్ తన పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ మోషన్ పోస్టర్‌తో అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో రాకీ బాయ్ ఫ్యాన్స్ ప్రజెంట్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. #WeNeedKGF2Teaser అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. అవును మరి కేజీఎఫ్ చూసిన ప్రతి ఒక్కరు రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలు బొమ్మ కనిపించేది రెండో భాగంలోనే కదా. అయితే కరోనా మహమ్మారి లేకపోతే దసరా సందర్భంగా ఈ రోజు (అక్టోబర్ 23) కేజీఎఫ్2 విడుదల అయ్యేది.
పండుగ ఇంకా రెండు రోజులు ఉన్నప్పటికి యష్ అభిమానులు మాత్రం ఈ రోజే పండుగ చేసుకునే వారు. థియేటర్లన్ని కిటకిటలాడేవి. కానీ కోవిడ్‌తో అంచనాలన్ని తలకిందులయ్యాయి. కేజీఎఫ్2 విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాంతో అభిమానులు ‘ఈ రోజు సినిమా రిలీజ్ చేస్తామన్నారు.. కుదరలేదు.. కనీసం టీజర్ అయినా విడుదల చేయండి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి #WeNeedKGF2Teaser హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. టీజర్‌పై అప్‌డేట్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత కార్తిక్ గౌడను కోరుతున్నారు. పాపం వారి డిమాండ్‌లో కూడా న్యాయం ఉంది కదా. (చదవండి: ప్రయాణం మళ్లీ మొదలైంది)
Dear @prashanth_neel & @Karthik1423 Sir..
— Vijayapur YashFc® (@YFCVijayapur) October 23, 2020
Announce Atleast Teaser Release Date Today 😶
* #RRR 60% Shooting Completed Team Released 2 Teasers
* #KGFChapter2 Almost Last Leg Of Shooting Not Even Any Update Since 13March Except @TheNameIsYash Boss Firstlook😶 #WeNeedKGF2Teaser pic.twitter.com/FFmW4kTUdR
ప్రస్తుతం కేజీఎఫ్2 సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. తుది షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. త్వరలోనే సంజయ్‌దత్ కేజీఎఫ్ 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా.. రవీనా టండన్ సినిమాకు కీలకమైన రమ్మికా సేన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవీ బస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 ,2021లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment