స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డుని సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
చదవండి: ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం(మే 20) నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రేపు ఓటీటీలో ఈ మూవీ చూసే డిజిటల్ ప్రేక్షకులకు తాజాగా జీ5 తీపి కబురు అందించింది. ఈ సినిమాకు ఇప్పుడు ఎలాంటి అదనపు చార్జీలు లేవని, సబ్‌స్క్రైబర్లు ఉచితంగా సినిమా చూడోచ్చంటూ తాజాగా ప్రకటన ఇచ్చింది.
చదవండి: ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
కాగా మొదట ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (టీవీవోడీ) పద్ధతిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జీ5 తెలిపింది. అంటే మనం మూవీని చూడాలంటే సబ్‌స్క్రైబర్లు రూ. 100 చెల్లించి ఈ మూవీని చూడాలి. దీంతో డిజిటల్ ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. థియేటర్లో డబ్బులు చెల్లించి, ఇక్కడ డబ్బుల చెల్లించాలా? అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ను ఉచితంగా చూడోచ్చని ఈ తాజా ప్రకటనలో తెలిపింది. డిమాండ్ ఎక్కువ ఉన్నందున్న సబ్‌స్రైబర్లు అందరూ ఈ సినిమాను ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీ5 పేర్కొంది.
A good day indeed, as ZEE5 Premium Subscribers can watch the World Digital Premiere for FREE from May 20th
— ZEE5 (@ZEE5India) May 19, 2022
Re-experience the roar, only on 4K Ultra HD!
Note: The best update from the roaring film!
World Digital Premiere - ONLY on #ZEE5#RRRonZee5fromMay20
Download ZEE5 app now pic.twitter.com/NO2lYzn4Jk
Comments
Please login to add a commentAdd a comment