Pay per View For RRR Movie OTT Streaming: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. మొత్తం ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
చదవండి: ఆసక్తికర వీడియో షేర్ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆలియా
ఇదిలా ఉంటే త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రేక్షకులకు షాకిస్తూ ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పే ఫర్ వ్యూ పద్దతిలో ఆర్ఆర్‌ఆర్‌ను ఓటీటీలో రిలీజ్ చేయాలని సదరు ఓటీటీ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలట. అయితే లాక్‌డౌన్‌లో చిన్న నుంచి పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు చూడాలంటే ప్రీమియర్ చెల్లించాల్సి వచ్చింది. అయితే అది డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన సినిమాలకు మాత్రమే.
చదవండి: క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
కానీ మొదటిసారి థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా ఓటీటీలో చూడాలంటే పే ఫర్ వ్యూ ఫార్మాట్‌ను ఫాలో అవ్వాలంటున్నాయట 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ ప్రీమియర్ సంస్థలు. కాగా ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు హక్కులు భారీ డీల్‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా హిందీ, విదేశీ భాషల వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇక మే 20న ఆర్ఆర్ఆర్ జీ5లో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా మే చివరి వరకు జీ5లో ఈ సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించక తప్పదని కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment