
సినీ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. రామ్‌చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈనెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ కానుంది. మరోవైపు అదే రోజున ఎన్టీఆర్ బర్త్‌డే కూడా ఉండటంతో సినీ ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment