సమతుల్య ఆహారం తప్పనిసరి
‘భద్రకాళి’ అంచున ఆదిమానవులు?
వరంగల్‌లోని భద్రకాళి చెరువు చుట్టూ ఆదిమానవులు జీ వనం సాగించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఎంజీఎం : చలికాలంలో వేడివేడి పదార్థాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆలుగడ్డ, బీట్‌రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్‌లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
º వేరుశనగ, బాదం, జీడి పప్పు, పిస్తా, కర్జూర వంటి తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఇవి బలవర్ధకమైన ఆహారంతోపాటు శరీరంలో వేడిని పుట్టిస్తాయి.
º చలి కాలంలో యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేస్తాయి.
º వంట గదిలోని ఆవాలు, ఎండు మిర్చి, మెంతులు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జీరా వంటి ద్రవ్యాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. జలుబు, దగ్గు, వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి.
º శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఆల్కహాల్, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి.
º చలిగాలి వెళ్లకుండా తల, చెవుల భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి. స్వెటర్లు వేసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లేవారు మఫ్లర్ లేదా మంకీక్యాప్ పెట్టుకోవాలి.
వేడివేడి పదార్థాలు తీసుకోవాలి
రవీందర్‌రెడ్డి, డైటీషియన్, ఎంజీఎం
Comments
Please login to add a commentAdd a comment