మిర్చి కోతలు షురూ..
వాజేడు: మండల కేంద్రంలో మిర్చి కోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా మిర్చి పంటలను సాగు చేసిన రైతులు మిరప పండ్లను బుధవారం నుంచి కోసే పనుల్లో నిమగ్నమయ్యారు. బాడువా ప్రాంతలో కోతలను ప్రారంభించిన రైతులు మిర్చి పండ్లను ట్రాక్టర్లలో తీసుకొచ్చి కల్లాల్లో ఆరబెట్టారు.
రంగురంగుల చిమ్మట
వాజేడు: చిమ్మట పురుగుపై వినాయకుడి రూపం దర్శనమిస్తుంది. బుధవారం రాత్రి చిమ్మట పురుగు రంగులతో కనపడింది. దానిని ఫొటో తీసి పరిశీలించి చూడగా ఆ రంగుల్లో రెండు కళ్లు, దంతాలు, తొండం, చెవుల ఆకరాన్ని పోలి వినాయకుడి తల రూపం కనపించింది.
టెక్నీషియన్ పోస్టులకు
దరఖాస్తులు
ఏటూరునాగారం: హైదరాబాద్ తార్నాకలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్యూట్ మోకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, ఏసీ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ పాసైన విద్యార్థులు, ఐటీఐ కళాశాలల్లోని అప్రెంటిస్ విభాగంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9490456335లో సంప్రదించాలని వివరించారు.
వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా చైర్మన్‌గా రాజు
ములుగు: ప్రపంచ వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా చైర్మన్‌గా ఏటూరునాగారానికి చెందిన గుండారపు రాజును నియమించినట్లు సంస్థ రాష్ట్ర చైర్మన్, ఫౌండర్ శ్రీకాంత్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రధాన కార్యాలయంలో రాజుకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతానని తెలిపారు. ఎక్కడైనా నాణ్యతాలోపమైన ఆహార పదార్థాలు ఉన్నట్లు తెలిస్తే తన దృష్టికి తీసుకరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment