తాగునీరు కరువు
భక్తులకు గద్దెల పరిసరాల్లో తాగునీటి వసతి కరువైంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు ఆది, గురు, బుధ, శుక్రవారాల్లో భక్తులు సుమారుగా 5వేల మందికిపైగా వస్తుంటారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గద్దెల ప్రాంగణ పరిసరాల్లో ఎక్కడ కూడా తాగునీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కులు సమర్పించేంత వరకు ఓపిక పట్టుకుని మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. జాతర సమయంలో తప్ప మిగతా రోజుల్లో అమ్మవార్ల సన్నిధిలో తాగునీటి వసతి ఎక్కడ కూడా కానరావడం లేదని భక్తులు వాపోతున్నారు. దేవాదాయశాఖ అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద తాత్కాలికంగా కర్రలతో ఏర్పాటు చేసిన ఒకే షవర్ కింద పురుషులు, మహిళలు స్నానాలు చేస్తున్నారు. దుస్తులు మార్చుకునేందుకు డ్రెస్ రూం కూడా ఏర్పాటు చేయపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వీటి గురించి దేవాదాయశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తున్నారని పూజారులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment