రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
ములుగు రూరల్: సీఎం కప్ –2024 జిల్లా స్థాయి క్రీడాపోటీలు మండల పరిధిలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం కబడ్డీ, హ్యాండ్ బాల్, యోగ, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులను రాష్టస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో తాడ్వాయి జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తుల రవి విద్యార్థులకు మెడల్, ప్రశంస పత్రాలు అందించారు. మిగతా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని 22వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ ఇన్‌చార్జ్ యాలం ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ బల్లూరి వేణు, పీఈటీల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment