
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ములుగు/ఏటూరునాగారం: శ్రీతమ భూ సమస్యలు పరిష్కరించండి తిరగలేకపోతున్నాం.. ఉపాధి కల్పించండి పని చేసుకుంటాం..ఐటీడీఏ పరిధిలో బోరువెల్ మంజూరు చేయాలని..ఇసుక క్వారీ రద్దు చేయాలని.. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలనిశ్రీ.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లో తమ గోడు వెలిబుచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఎస్‌ఓ రాజ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో 35 దరఖాస్తులు రాగా గిరిజన దర్బార్‌లో పీఓ చిత్రామిశ్రా లేకపోవడంతో మూడు వినతులు మాత్రమే వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు.
హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..
హమాలీల సంక్షేమానికి హమాలీ బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అధికారంలోకి రాగానే హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కార్మికులకు ఉపాధి కల్పన కరువైందని తెలిపారు. కొంతమంది పక్క రాష్ట్రాలకు చెందిన హమాలీ కార్మికులను తక్కువ జీతానికి తీసుకొచ్చి స్థానిక కార్మికుల పొట్టకొడుతున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
●
గ్రీవెన్స్‌లో వచ్చిన వినతుల వివరాలు
భూ సమస్యలపై : 12
గృహ నిర్మాణ శాఖ : 02
పెన్షన్ : 03
ఇతర శాఖలకు.. : 18
కనీస సౌకర్యాలు కల్పించాలి..
వెంకటాపురం (కె) మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కనీస సౌకర్యాలు కల్పించాలి. పాఠశాల భవనం అసంపూర్తిగా ఉంది. విద్యార్థులకు వసతి, తాగునీరు, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. బర్లగూడెం గ్రామా పంచాయతీలో వసతిగృహం, పాఠశాల వేర్వేరుగా ఉన్నాయి. పాఠశాల భవనం పూర్తి అయితే రోజు వారీగా విద్యార్థులు సుమారు 500మీటర్ల మేర నడిచే సమస్య తీరుతుంది. 2014–15 విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక సిబ్బందితో పాఠశాలను నెట్టుకొస్తున్నారు. తక్షణమే రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని కలెక్టర్‌కు వినతిని విన్నవించారు. చేల నవీన్, చిరుతపల్లి, స్థానికుడు
ఈ ఫొటోలోనిది వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన రైతులు. 1999లో వన సంరక్షణ సమితి సంఘాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఆ సంఘంలో 33మంది సభ్యులుగా ఉన్నారు. అంతకు ముందు 1980నుంచి పేరూరు గ్రామ పంచాయతీలోని రాంపురం గ్రామం వెనుకాల ఉన్న ప్రభుత్వ భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆనాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ భూమిని పట్టా చేయించుకోలేక పోయారు. అదే సమయంలో అటవీశాఖ జామాయిల్ మొక్కలు ఉచితంగా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది. సంఘం తరఫున 50ఎకరాల్లో మొక్కలను పెంచారు. ఇప్పుడు ఆ చెట్లను పెంచిన వారికి వాటిపై ఎలాంటి హక్కు లేదని అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో అటవీ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి పట్టాలు ఇప్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో
ప్రజల వినతులు
స్వీకరించిన కలెక్టర్ టీఎస్.దివాకర,
ఎస్‌ఓ రాజ్‌కుమార్
మొత్తంగా 38 దరఖాస్తుల స్వీకరణ
పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య