
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
కాజీపేట అర్బన్/ఖిలావరంగల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు.
స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..
ప్రతి రోజు
ఉదయం 10.30
నుంచి 1.30
గంటల వరకు
24 స్లాట్స్
మధ్యాహ్నం
2 నుంచి
సాయంత్రం
5 గంటల వరకు
24
స్లాట్స్
మెరుగైన సేవలు
అందిస్తున్నాం..
ప్రభుత్వం ప్రవేశ పె ట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మె రుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్‌కు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.
వృద్ధులు,
దివ్యాంగులు,
పేషంట్ల కోసం
సాయంత్రం 5 నుంచి
6 గంటల వరకు
5
స్లాట్స్
15 నిమిషాల్లో దస్తావేజులు..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 53 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు.
● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36
● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.
రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్
ప్రతీరోజు రెండు కార్యాలయాల్లో 106
– జి.నరేందర్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్ట్ వరంగల్

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025