నాగర్‌కర్నూల్
శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2025
ప్రతిసారి కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు, నూతన రైల్వే లైన్లకు నిధుల మంజూరుపై అన్యాయం జరుగుతోంది. ముద్కేడ్–సికింద్రాబాద్ మీదుగా అకోల–డోన్ (పూర్ణ–ముద్కేడ్, బొల్లారం–మహబూబ్‌నగర్ మినహా) డబ్లింగ్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.220 కోట్లు కేటాయించారు. మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తయిన భాగాన్ని మినహాయించి ముద్కేడ్–డోన్ మధ్య ప్రాజెక్టు అమలు కోసం అంచనాలను తయారు చేశారు. రెండేళ్ల కిందట బడ్జెట్లో మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ లైన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు సెక్షన్ల ప్రకారం డబ్లింగ్ లైన్ పనులు కొనసాగుతున్నాయి.
ప్రతిపాదనల వద్దే ముగిసిన రైల్వే లైన్లు
ఈసారి బడ్జెట్లోనైనా కృష్ణా–వికారాబాద్, గద్వాల–డోర్నకల్ నూతన లైన్లకు నిధులు కేటాయిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో 1988 నుంచే నారాయణపేట జిల్లా కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌కు రూ.90 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఈ లైన్ కోసం ఐదుసార్లు సర్వే చేశారు. గత ఏడాది ఈ రైల్వే ప్రాజెక్టు కోసం ఫైనల్ లొకేషన్ (ఎఫ్ఎల్ఎస్)కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ లైన్ పరిధిలో 316 కిలోమీటర్ల వరకు సర్వే చేయాల్సి ఉండగా, ఇందుకోసం మొత్తం రూ.7.91 కోట్ల నిధులు కేటాయించారు. అయినప్పటికీ పనులు పూర్తిచేసేందుకు ప్రతి బడ్జెట్లో ఈ లైన్‌కు నిధులు కేటాయించడం లేదు.
● గద్వాల–డోర్నకల్ (220 కిలోమీటర్లు) లైన్‌కు 1992లో రూ.190 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. గద్వాల–మాచర్ల లైన్ కోసం నాలుగున్నర దశాబ్దాలుగా వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. మూడుసార్లు సర్వే చేసి వదిలేశారు. ప్రతి ఏడాది ఊరిస్తున్న ఈ కొత్తరైల్వే లైన్ కోసం ఈసారి బడ్జెట్లోనైనా కేటాయింపులు దక్కుతాయోనన్నది వేచిచూడాల్సి ఉంది.
ప్రతిఏడాది ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు
● ఈసారి కేంద్ర బడ్జెట్లోనైనా మోక్షం కలిగేనా?
● కొత్త రైల్వే లైన్ల కోసం
జిల్లావాసుల ఎదురుచూపులు
● కృష్ణా–వికారాబాద్,
గద్వాల–డోర్నకల్ లైన్లు సర్వేకే పరిమితం
● ఊరిస్తున్న గద్వాల–మాచర్ల రైల్వే లైన్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment